- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లారెడ్డికి తొడకొట్టి కౌంటర్ ఇచ్చిన మహిళా నాయకురాలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు మండిపడ్డారు. అవినీతికి పాల్పడి తొడకొడతావా ఖబడ్డార్ అంటూ తొడకొట్టారు. శుక్రవారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి మాటలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సునీతా రావు మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఉన్నదని గుర్తు చేశారు. అధికార పార్టీలో ఉండి భూకబ్జాలకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు మండిపడ్డారు. అవినీతికి పాల్పడి తొడకొడతావా ఖబడ్డార్ అంటూ తొడకొట్టారు. శుక్రవారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి మాటలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం సునీతా రావు మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఉన్నదని గుర్తు చేశారు. అధికార పార్టీలో ఉండి భూకబ్జాలకు పాల్పడి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడని విమర్శించారు. భూ కబ్జాల మంత్రి మల్లారెడ్డి తొడ కొట్టి సవాల్ విసిరితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నువ్వే కాదు.. మేము తొడ కొట్టగలం అంటూ సునీతారావు తొడ కొట్టారు. మతిలేని టీఆర్ఎస్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీ, ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, కోఆర్డినేటర్ నీలం పద్మ, జనరల్ సెక్రటరీ లక్ష్మి, మస్రత్ సుల్తానా, సుజాత, షబానా, కవిత, జయ తదితరులు పాల్గొన్నారు.






