- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవల పిల్లల హత్యకేసులో వీడిన మిస్టరీ.. నిందితుడు ఎవరంటే ?
<p>దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. తండ్రే చిన్నారులను విషమిచ్చి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యపై అనుమానంతోనే పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే మనుబోలు మండలం రాజోలుపాడులో గత నెల 20న పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]</p>

దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. తండ్రే చిన్నారులను విషమిచ్చి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యపై అనుమానంతోనే పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే మనుబోలు మండలం రాజోలుపాడులో గత నెల 20న పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టంలో పాలల్లో విషమిచ్చి చంపినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో చిన్నారుల తండ్రి వెంకటరమణయ్యను విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తన భార్యకు పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అది పెళ్లైన తర్వాత తెలిసిందని పోలీసులకు తెలిపాడు. ఆమె తనను మోసం చేసిందని అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నట్లు తెలిపాడు. చిన్నారులు ఇద్దరినీ చంపేసి ఆ హత్యను ఆమెపై నెట్టేసి జైలుకు పంపాలని భావించినట్లు తెలిపాడు. అనంతరం పోలీసులు వెంకట రమణయ్యను అరెస్ట్ చేశారు. మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.






