ఆ రైతుకు గేదంటే ఎంతప్రేమో.. అందుకే అలా చేశాడు

by  |
ఆ రైతుకు గేదంటే ఎంతప్రేమో.. అందుకే అలా చేశాడు
X

దిశ, ఖానాపూర్: పల్లెటూర్లలో పశువుల పై వాటి యజమానికి మమకారం ఉంటుంది. వాటిని వారి కన్నబిడ్డలలానే చూసుకుంటారు. అయితే కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వం అందరూ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి, సామాజిక దూరం పాటించాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తన పశువులకు సోకుతుందేమోనని భయపడి ఓ రైతు తెలివిగా ఆలోచించాడు. ఏలా అనుకుంటున్నారా.. తాను ఎంతో ఇష్టంగా పెంచుకునే గేదలకు మాస్క్ పెట్టి కరోనా బారిన పడకుండా కాపాడుకుంటున్నాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రేండ్ల చిన్న రాజన్న అనే రైతు తన కుటుంబంతో సహా తన పెంపుడు జంతువులు కూడా కొవిడ్ బారి నుండి కాపాడుకోవాలని తన పెంపుడు జంతువు గేదెకు మాస్క్ కట్టినట్లుగా ఆయన తెలిపారు. గ్రామంలోని ప్రజలు మాస్కులు లేనిదే బయటకు వెళ్లవద్దని, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. అలానే గ్రామంలోని వారందరూ తమ పశువులకు కూడా మాస్క్ పెట్టి వాటిని కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు.


Next Story

Most Viewed