- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌ను అడ్డుకున్న ఆ కుటుంబం
<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీరన్నపేట్‌లో 660 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మంత్రి కాన్వాయ్ ను ఓ కుటుంబం అడ్డుకుంది. తమ భూమిని కబ్జా చేసి టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్ రూం కట్టారని, ఇదేంటనీ అడిగితే బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే […]</p>

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీరన్నపేట్‌లో 660 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మంత్రి కాన్వాయ్ ను ఓ కుటుంబం అడ్డుకుంది. తమ భూమిని కబ్జా చేసి టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్ రూం కట్టారని, ఇదేంటనీ అడిగితే బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబం మంత్రిని కలవకుండానే స్థానిక పోలీసులు ఆ కుటుంబాన్ని పక్కకు ఈడ్చి పడేశారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వారిపట్ల వ్యవహరించిన తీరు స్థానిక ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న స్థానిక టీఆర్ఎస్ నేతల ఆగడాలకు చెక్ పెట్టకపోతే ఇంకేంత మంది భూములు కబ్జా చేస్తారోనంటూ మండిపడుతున్నారు.






