- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగ బాబా దొరికిపోయాడు.. ఎక్కడంటే..?
by Batti.Sumithra |
<p>దిశ, చేవెళ్ల : అమాయక ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని మంత్రాలతో బాగు చేస్తానని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ మండలం మద్దూరు గ్రామానికి చెందిన నారాయణ చారి అదే గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకున్నా, ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మంత్రాలతో బాగు చేస్తానని అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. […]</p>

X
దిశ, చేవెళ్ల : అమాయక ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని మంత్రాలతో బాగు చేస్తానని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ మండలం మద్దూరు గ్రామానికి చెందిన నారాయణ చారి అదే గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకున్నా, ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మంత్రాలతో బాగు చేస్తానని అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నారాయణ చారి ఇంటిపై దాడి చేసి రూ.4వేల నగదు తో పాటు పూజా సామాగ్రి ని స్వాధీనం చేసుకుని దొంగ బాబాను అదుపులోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు.
Next Story






