- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీరు తెప్పిస్తున్న వృద్ధ దంపతుల ఆత్మహత్య
<p>దిశ, వేములవాడ: మలిదశలో కొడుకులకు, కూతురుకి భారం కావద్దని ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాదు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన నోముల భూమి రెడ్డి(68), లచ్చవ్వ (60)దంపతులు ఆదివారం ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉండగా అందులో ఒక కొడుకు ఉపాధి కోసం ఖతార్ దేశానికి వలస వెళ్ళాడు. […]</p>

దిశ, వేములవాడ: మలిదశలో కొడుకులకు, కూతురుకి భారం కావద్దని ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాదు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన నోముల భూమి రెడ్డి(68), లచ్చవ్వ (60)దంపతులు ఆదివారం ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉండగా అందులో ఒక కొడుకు ఉపాధి కోసం ఖతార్ దేశానికి వలస వెళ్ళాడు.
మిగతా ఇద్దరు కొడుకులు ఒకటే ఇంట్లో నివాసం ఉంటారు. కానీ భూమిరెడ్డి, లచ్చావ్వలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లచ్చవ్వకు కొంత వైకల్యం ఉండగా ఈ మధ్యనే భూమి రెడ్డికి పక్షపాతం వచ్చి మంచానికి పరిమితం అయ్యాడు. వైద్యం చేయించుకున్న అనంతరం వ్యాధి నయమైనప్పటికీ కొంతకాలంగా మానసికంగా కుంగిపోయారు. దీంతో ఈ వయసులో కొడుకులకు, కూతురికి భారం కావద్దని బలవన్మరణానికి పాల్పడ్డారు. దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి భారీగా తరలివచ్చారు. ఈ విషయమై ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






