దారుణం.. చెల్లికి అది ఇచ్చి రేప్ చేసిన అన్న.. అర్ధరాత్రి అక్కడికి తీసుకెళ్లి మరీ

193

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు మరిచి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అన్న వరుస అయ్యే ఒక యువకుడు, బాలికను బయటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్‌లో సంచనలంగా మారింది.

వివరాల్లోకి వెళితే..  జైపూర్‌లోని చాంద్‌పోల్ ప్రాంతానికి చెందిన ఓ 17ఏళ్ల యువతి వరుసకు సోదరుడైన మనీష్ గోత్వాల్‌తో కలిసి శనివారం గల్టా ధామ్ సందర్శించడం కోసం బయటకు వెళ్లింది. అక్కడ అన్ని ప్రదేశాలను తిప్పి చూపించిన అన్న, చెల్లి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. తిరిగి తిరిగి అలసిపోవడంతో బాలిక మారుమాట్లాడకుండా కూల్ డ్రింక్ తాగేసింది. ఆ తరువాత స్పృహ తప్పి పడిపోయింది. ముందే ఆ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిన మనీష్, బాలిక స్పృహ కోల్పోయాక పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం బాలిక కళ్లుతెరిచాకా ఈ విషయం ఇంట్లో చెపితే చంపేస్తానని బెదిరించి, ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక ఇంటికి రావడం, ఆమె ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  సంఘటన జరిగిన గల్టా అటవీ ప్రాంతం కావడంతో  కేసును అక్కడికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..