వెనిస్ చిత్రోత్సవంలో మరాఠీ చిత్రానికి అవార్డ్

by Shyam |   (  Updated:2020-09-13 02:53:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తొలి చిత్రం ‘కోర్టు’తోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు చైతన్య తమ్హనే. తన దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘ది డిసిపుల్ (The Disciple). ఇటీవలే జరిగిన 77వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు గాను ‘బెస్ట్ స్క్రీన్‌ప్లే’ అవార్డు అందుకున్నాడు చైతన్య. ముంబైకి చెందిన చైతన్యకు వెనిస్ చిత్రోత్సవంలో అవార్డు రావడంతో బాలీవుడ్ ప్రముఖులు రిచా చద్దా, అలీ ఫజల్, అనురాగ్ కశ్యప్, తిలోత్తమ షోమేలు ప్రశంసించారు. ‘ది డిసిపుల్’ [&hellip;]</p>

వెనిస్ చిత్రోత్సవంలో మరాఠీ చిత్రానికి అవార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: తొలి చిత్రం ‘కోర్టు’తోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు చైతన్య తమ్హనే. తన దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘ది డిసిపుల్ (The Disciple). ఇటీవలే జరిగిన 77వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు గాను ‘బెస్ట్ స్క్రీన్‌ప్లే’ అవార్డు అందుకున్నాడు చైతన్య. ముంబైకి చెందిన చైతన్యకు వెనిస్ చిత్రోత్సవంలో అవార్డు రావడంతో బాలీవుడ్ ప్రముఖులు రిచా చద్దా, అలీ ఫజల్, అనురాగ్ కశ్యప్, తిలోత్తమ షోమేలు ప్రశంసించారు.

‘ది డిసిపుల్’ చిత్రాన్ని.. లాస్ట్ వీక్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. కాగా, అవార్డుతో పాటు చిత్రోత్సవ జ్యూరీ సభ్యుల అభినందనలు అందుకున్న ఈ చిత్రం.. మీరా నాయర్ ‘మాన్‌సూన్ వెడ్డింగ్ (2001)’ తర్వాత, యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో మేజర్ కాంపిటీషన్ కేటగిరీకి ఎంపికైన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సంవత్సరం భారతదేశం నుంచి టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక చిత్రం కూడా ‘ది డిసిపుల్’. ఈ మరాఠీ చిత్రానికి నాలుగుసార్లు ఆస్కార్ విజేతగా నిలిచిన ఫిల్మ్ మేకర్ ఆల్ఫాన్సో క్యూరన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చైతన్య దాదాపు నాలుగేళ్లు శ్రమించాడు.

తన తొలిచిత్రం ‘కోర్టు’తోనే చైతన్య అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. 88వ ఆస్కార్ అవార్డ్స్‌కు మన దేశం తరపున ఎంపికైన చిత్రంగా ‘కోర్టు’ నిలిచింది. కోర్ట్‌ రూమ్ డ్రామాగా విడుదలైన ఈ మరాఠీ చిత్రం 71వ వెనిస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డుని సొంతం చేసుకోవడమే కాకుండా 62వ నేషనల్‌ ఫిలిం అవార్డ్స్‌లో జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్నీ పొందింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బ్యూనోస్ ఏరిస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమాలోనూ ఇది అవార్డులు సొంతం చేసుకుంది.

Read Also…

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్‌లో మనోజ్ బాజ్‌పాయ్

Next Story