ఎంఎస్ ధోనిని మించిపోయిన జడేజా.. CSK కీలక నిర్ణయం

by  |

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఐపీఎల్‌‌‌ సీజన్ ‌కోసం ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో అన్ని జట్లు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల గురించి ఒక క్లారిటీకి వచ్చాయి. చెన్నై జట్టు మాత్రం గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అయితే CSK జట్టు ఫస్ట్ స్లాబ్‌లో కెప్టెన్ ధోనిని కాకుండా జడేజాను తీసుకుంది. దీని కోసం జడ్డుకు ఏకంగా రూ. 16 కోట్లు ఇవ్వనున్నారు. గతంలో జడ్డుకు కేవలం రూ.7 కోట్లే చెల్లించిన సంగతి తెలిసిందే. సెకండ్ స్లాబ్‌లో ధోనిని తీసుకుని రూ. 13 కోట్లు చెల్లించనున్నారు. ఇది గతంలో కంటే 3 కోట్లు తక్కువ. అయితే ధోని అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెన్నై ఫ్రాంచైజీ తెలిపింది. ఇక మూడవ స్లాబ్‌‌లో మొయిన్ అలీ‌కి రూ. 8 కోట్లు, నాల్గవ స్లాబ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 6 కోట్లు చెల్లించనున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story