- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌కు కేవీపీ ఘాటు లేఖ: వైఎస్ఆర్‌పై వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు ఘాటు లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ (YSR) పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడేవారని ఇటీవల జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ (KVP) రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇవాళ ఆయన పవన్‌కు ఓ ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. వైఎస్ఆర్ విషక్షంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తున్నానని అన్నారు. వైఎస్సార్‌కు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కేవీపీ తెలిపారు.
అదేవిధంగా వైఎస్ YS ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్‌పై ఎలాంటి కేసులు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కామెంట్ చేశారు. అధికారి చెప్పింది నిజమైతే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తాను రూ.10 కోట్లు ఇస్తానని సవాలు విసిరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉందని అన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయడానికి.. చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేవీపీ, పవన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.






