ఆత్మహత్య చేసుకున్న జంట.. అసలేం జరిగిందంటే..?

by Batti.Sumithra |   (  Updated:2021-07-03 12:16:14  IST  )

<p>దిశ, అచ్చంపేట: ఆమెకు పెళ్లయి తొమ్మిదేళ్ల అయింది.. అతను అవివాహిత యువకుడు.. అయినా కలిసి జీవించాలి అనుకొని ఆ వివాహిత తన మూడేళ్ల కుమారుని తీసుకుని ఆ యువకుని వెంట వెళ్లి చివరకు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అమ్రాబాద్ సీఐ బిసన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శమంతకమణి(27), సురేష్(24) చిన్నప్పటి నుండే ప్రేమికులు. ఇరువురి కులాలు వేరు కావడం, యువకుని వయసు [&hellip;]</p>

ఆత్మహత్య చేసుకున్న జంట.. అసలేం జరిగిందంటే..?
X

దిశ, అచ్చంపేట: ఆమెకు పెళ్లయి తొమ్మిదేళ్ల అయింది.. అతను అవివాహిత యువకుడు.. అయినా కలిసి జీవించాలి అనుకొని ఆ వివాహిత తన మూడేళ్ల కుమారుని తీసుకుని ఆ యువకుని వెంట వెళ్లి చివరకు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అమ్రాబాద్ సీఐ బిసన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శమంతకమణి(27), సురేష్(24) చిన్నప్పటి నుండే ప్రేమికులు. ఇరువురి కులాలు వేరు కావడం, యువకుని వయసు మూడేళ్లు చిన్నది కావడంతో తల్లిదండ్రులు వారి పెళ్లికి అప్పట్లో అంగీకరించలేదు. 9 ఏళ్ల క్రితమే శమంతకమణి కి ఆమనగల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. వివాహమైన అనంతరం శమంతకమణి, భర్తతో హైదరాబాదులో నివాసముంటున్నారు.

వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ శమంతకమణి, సురేష్ తమ ప్రేమ వ్యవహారాన్ని చాటుమాటుగా కొనసాగించారు. ఈ క్రమంలో ఇటీవల సురేష్, శమంతకమణి తన కుమారుడిని తీసుకొని ఇరవై రోజుల క్రితం పరారయ్యారు. ఇందుకు సంబంధించి శమంతకమణి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనూ, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. ఈ కొన్ని రోజులు పలుచోట్ల రహస్యంగా గడిపిన జంట శనివారం తాము మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయ పరిసరాలలో ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఈ స్థలానికి వెళ్లేసరికి కనిపించకపోవడంతో, మరి కొంత దూరం వెళ్ళి పరిశీలించగా శవాల మధ్య బాలుడు ఏడుస్తూ కుటుంబ సభ్యులకు కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గా సిఐ తెలిపారు.

Next Story