- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాములు తింటే కరోనా రాదంటున్న వడివేలు.. వీడియో వైరల్!
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండగా, మరణాల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా స్టాక్ సరిపడా లేకపోవడంతో కరోనా కట్టడి అంతగా సాధ్యపడలేదు. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఆయుర్వేద మందులు వాడాలని కొందరు చెబుతుంటే, మరికొందరేమో పూజలు చేయాలని ఎవరికి తోచినట్లు ఇష్టారీతిన సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన వడివేలు అనే వ్యక్తి కరోనా సోకకుండా ఉండాలంటే పాములు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండగా, మరణాల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా స్టాక్ సరిపడా లేకపోవడంతో కరోనా కట్టడి అంతగా సాధ్యపడలేదు. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఆయుర్వేద మందులు వాడాలని కొందరు చెబుతుంటే, మరికొందరేమో పూజలు చేయాలని ఎవరికి తోచినట్లు ఇష్టారీతిన సలహాలు ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన వడివేలు అనే వ్యక్తి కరోనా సోకకుండా ఉండాలంటే పాములు తినాలని చెబుతున్నాడు. అతను లైవ్ లో పామును తింటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వడివేలును అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం సేవించి మత్తులో పామును తిన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా జనాలను తప్పుదారిస్తున్న వడివేలును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.






