- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామంలో అది లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.. పట్టించుకునేవారే లేరా..?
<p>దిశ, నూతనకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా రవాణాలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ కొన్ని గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలో కూడా వెలుగుచూసింది. పాలేరు వాగుపై బ్రిడ్జి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాలేరు వాగుపై బ్రిడ్జి మాట ఒకటి రెండు […]</p>

దిశ, నూతనకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా రవాణాలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ కొన్ని గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలో కూడా వెలుగుచూసింది. పాలేరు వాగుపై బ్రిడ్జి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాలేరు వాగుపై బ్రిడ్జి మాట ఒకటి రెండు రోజుల ముచ్చట కాదు, సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతుంది.
రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వర్షం పడిన ప్రతిసారి వాగు పొంగి ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత ఆ వాగులో మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లు వేసి గ్రామస్థులు రాకపోకలు సాగిస్తారు. ఎప్పటికప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించడం తప్ప ఆ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. వాగు నిండుగా వస్తే అక్కడి నుంచి వెళ్లకుండా మాచనపల్లి నుండి తానంచర్ల మీదుగా పొలాల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇది సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనివలన గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.






