పోలీసుల ఎంట్రీ.. పీటలపై ఆగిన పెళ్లి

by  |
పోలీసుల ఎంట్రీ.. పీటలపై ఆగిన పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాను తలపించేలా ఓ పెళ్లిలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నారు. కొద్దిసేపట్లో జరగాల్సిన పెళ్లి, పీటలపై ఆగిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. గంటలో పెళ్లి అనగా వధువు అందరికీ షాక్ ఇచ్చింది. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసులకు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ పెళ్లి పీటలపై నిలిచిపోయింది. అనంతరం చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వధువును పోలీసులు చెన్నై తరలించారు. అంతేగాకుండా వధువు చెన్నైలో సహ ఉద్యోగిని ప్రేమించినట్టు సమాచారం. తన ప్రేమ వ్యవహారాన్ని ఆ యువతి చివరి నిముషం వరకూ దాచడంతో… పెళ్లి పీటలపై ఆగిపోయింది. మొత్తానికి పెళ్లి ఇలా ఆగిపోవడంతో వచ్చిన బంధువులంతా ఆశ్చర్యపోయారు.


Next Story

Most Viewed