- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో తల్లి శృంగారం చేస్తుండగా బాలుడి ఎంట్రీ.. దీంతో
<p>దిశ, వెబ్‌డెస్క్: తల్లి అక్రమ సంబంధం ఆ బాలుడి పాలిట మృత్యుపాశమైంది. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బరురాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… లక్ష్మినియా గ్రామంలోని నీరజ్(10) తల్లి శివానిపట్టి ప్రాంతానికి చెందిన సంజయ్ పండిట్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరు ఇంట్లో శృంగారం చేసే సమయంలో నీరజ్ అక్కడకు వచ్చాడు. అయితే వీరి చేసే తతంగాన్ని నీరజ్ చూసే సరికి ఎవ్వరికైనా వారి వివాహేతర […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తల్లి అక్రమ సంబంధం ఆ బాలుడి పాలిట మృత్యుపాశమైంది. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బరురాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… లక్ష్మినియా గ్రామంలోని నీరజ్(10) తల్లి శివానిపట్టి ప్రాంతానికి చెందిన సంజయ్ పండిట్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరు ఇంట్లో శృంగారం చేసే సమయంలో నీరజ్ అక్కడకు వచ్చాడు. అయితే వీరి చేసే తతంగాన్ని నీరజ్ చూసే సరికి ఎవ్వరికైనా వారి వివాహేతర సంబంధం గురించి తెలిసిపోతుందేమోనని భయపడ్డాడు. దీంతో నీరజ్ ను హతమార్చాడు.
ఇంట్లో నీరజ్ కనిపించకపోవడంతో కుటుంబీకులు గ్రామంలో వెతుకుతుండగా నీరజ్ మృతదేహం లభ్యమైంది. దీంతో నీరజ్ తల్లి సంజయ్‌పై ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నీరజ్ ను కెనాల్ దగ్గరకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు విచారణలో సంజయ్ అంగీకరించాడు. అంతేకాకుండా ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.






