- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్ పల్లి సాయినాథ్ సొసైటీ ప్రణీత్ హోరా బహుళ అంతస్తుల నిర్మాణం సమీపంలో గుర్తు తెలియని యువకుడు(28) మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ముక్కులో నుంచి రక్తం కారుతుంది. ఎవరో హత్య చేసి పడేసి వెళ్ళారా.. లేక […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్ పల్లి సాయినాథ్ సొసైటీ ప్రణీత్ హోరా బహుళ అంతస్తుల నిర్మాణం సమీపంలో గుర్తు తెలియని యువకుడు(28) మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ముక్కులో నుంచి రక్తం కారుతుంది. ఎవరో హత్య చేసి పడేసి వెళ్ళారా.. లేక ఇంకేమైనా జరిగిందా..? తెలియాల్సి ఉంది. మృతుడి కుడి చేయిపై ఇంగ్లీష్‌లో సంధ్య-రమేష్ అని, తెలుగులో అమ్మ అని పచ్చ బొట్టు ఉంది. గుర్తు తెలియని మృతదేహం గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






