- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై నగ్నంగా మృతదేహం.. తరువాత తెలిసింది ఏంటంటే..?
<p>దిశ, చార్మినార్ : పాతనేరస్థుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి దారుణహత్యకు పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, మృతుడు కార్వాన్కు చెందిన పాతనేరస్థుడు ఆసిఫ్ గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్లామియా కాలేజ్ వెనుక భాగంలోని నడి రోడ్డు పై నగ్నంగా ఓ […]</p>

దిశ, చార్మినార్ : పాతనేరస్థుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి దారుణహత్యకు పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, మృతుడు కార్వాన్కు చెందిన పాతనేరస్థుడు ఆసిఫ్ గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్లామియా కాలేజ్ వెనుక భాగంలోని నడి రోడ్డు పై నగ్నంగా ఓ యువకుడి మృతదేహాం పడి ఉందంటూ మార్నింగ్ వాక్‌లో ఉన్న స్థానికులు చూసి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతుడి పడి ఉన్న ప్రదేశంలోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు సీన్ ఆఫ్ ఆఫెన్స్ చేపట్టారు.

డాగ్‌స్క్వాడ్స్‌తో పాటు క్లూస్ టీంను రప్పించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యగా చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. మృతుడి గొంతు, పొట్ట, ఛాతి, నడుమ భాగాలలో 7నుంచి 8 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి నగ్నం ఇక్కడ పడ వేయడం పట్ల కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పక్కనే నిర్మాణుష్య ప్రదేశంలో టీషర్టుతో పాటు ట్రాక్ ప్యాంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఎక్కడో హత్యచేసి ఇక్కడ మృతదేహాన్ని పడవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం రాత్రి మృతుడు టోలీ మజీద్కార్వాన్కు చెందిన ఆసీఫ్(45)గా గుర్తించారు. పోలీసుల విచారణలో మృతుడిపై దొంగతనం కేసు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






