పెట్రోల్ కోసం బంక్‌కు వెళితే.. నీళ్లు కొట్టారు..

by Vadlamudi Anukaran |

<p>దిశ, నూతనకల్ : నూతనకల్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొనగా వాటర్ కలిసి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన పులుసు నాగేశ్వరరావు ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో, మూడు లీటర్ల పెట్రోల్ బైక్‌లో కొట్టించుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే బైకు అకస్మాత్తుగా ఆగిపోయింది. బైక్‌ను మళ్లీ స్టార్ట్ చేయగా ఎంతసేపటికీ [&hellip;]</p>

పెట్రోల్ కోసం బంక్‌కు వెళితే.. నీళ్లు కొట్టారు..
X

దిశ, నూతనకల్ : నూతనకల్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొనగా వాటర్ కలిసి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన పులుసు నాగేశ్వరరావు ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో, మూడు లీటర్ల పెట్రోల్ బైక్‌లో కొట్టించుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే బైకు అకస్మాత్తుగా ఆగిపోయింది. బైక్‌ను మళ్లీ స్టార్ట్ చేయగా ఎంతసేపటికీ స్టార్ట్ కాలేదు. దీంతో అనుమానం వచ్చి కొట్టించుకున్నపెట్రోల్‌‌ను బాటిల్లో పట్టగా వాటర్ రావడం చూసి షాక్ అయ్యారు. బైక్ లో ఉన్న మొత్తం పెట్రోల్ ను తీయగా రెండున్నర లీటర్ల వరకు వాటర్ రావడం, అందులో కేవలం అర లీటర్ మాత్రమే పెట్రోల్ ఉండడం చూసి నాగేశ్వరరావు వాపోయాడు.

అధికారుల తనిఖీలు ఏవి

పెట్రోల్ బంక్‌లపై తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వాహనదారులకు కుచ్చుటోపి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రతినెల సందర్శించి బంక్‌లో పెట్రోల్ నాణ్యతపై పరీక్షలు నిర్వహించాలని, బంకుల్లో సిబ్బంది కొరత వలన వాహనదారులు అధిక సమయం వేచి ఉండటం, పేరుకు గాలి మిషన్ ఉన్నా, పని చేయకపోవడంతో టైర్లలో గాలి చెక్ చేసే సిబ్బంది లేక ఇబ్బందికి గురవుతున్నారు. అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయంపై పెట్రలో బంక్ యజమాని నరసింహంను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా ‘అలాంటిది ఏమీ లేదు’ అని వివరణ ఇచ్చారు.

Next Story