జీబ్రా లైన్ దాటిన వాహదారుడు.. క్రేజీ పంచ్ ఇచ్చిన నెటిజన్ (వీడియో)

by Shyam |

<p>దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు, రవాణా శాఖ, ఎన్జీవోలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇటు ప్రజల్లో అటు వాహనాదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు తెలియకుండానే రోడ్డెక్కి ఇతర వాహదారులకు ఇబ్బంది పెడుతూ కొందరు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరికొందరు పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించేస్తున్నారు. అంతేగాకుండా.. ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడగానే జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వాహనాలు నిలిపి పాదచారులకు దారినివ్వాలి. [&hellip;]</p>

bike rider, zebra line
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు, రవాణా శాఖ, ఎన్జీవోలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇటు ప్రజల్లో అటు వాహనాదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు తెలియకుండానే రోడ్డెక్కి ఇతర వాహదారులకు ఇబ్బంది పెడుతూ కొందరు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరికొందరు పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించేస్తున్నారు. అంతేగాకుండా.. ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడగానే జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వాహనాలు నిలిపి పాదచారులకు దారినివ్వాలి.

కానీ, ఓ వాహనదారుడు రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా దారివ్వకుండా.. జీబ్రాలైన్ దాటి వాహనం నిలిపాడు. దీంతో సదరు వాహనదారుడికి ఓ నెటిజన్ కాస్త వినూత్నంగా పంచ్ ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘ఓ సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. వాహనదారుడు అది పట్టించుకోకుండా జీబ్రా క్రాసింగ్ దాటి వాహనాన్ని నిలిపాడు. దీంతో అక్కడే ఉన్న ఓ పాదాచారి సదరు వాహనం ఎక్కి దాటి వెళ్లాడు.’’ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిబంధనలు పాటించని వారికి చెంపదెబ్బలా ఈ వీడియో ఉందని, పాదచారుల కోసం ఏర్పాటు చేసిన జీబ్రాక్రాసింగ్‌ను విడిచి వాహనాలు నిలపాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story