- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. పోసానిపేట గ్రామానికి చెందిన 13 మంది కూలీలు ఉపాధి హామీ పనుల నిమిత్తం సోమవారం ఉదయం ఆటోలో బయలుదేరారు. గ్రామ శివారులోని గంజివాగు వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో పల్లీకొట్టింది. దాంతో డ్రైవర్ సహా ఆటోలో వెళ్తున్న 9 మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి […]</p>

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. పోసానిపేట గ్రామానికి చెందిన 13 మంది కూలీలు ఉపాధి హామీ పనుల నిమిత్తం సోమవారం ఉదయం ఆటోలో బయలుదేరారు. గ్రామ శివారులోని గంజివాగు వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో పల్లీకొట్టింది. దాంతో డ్రైవర్ సహా ఆటోలో వెళ్తున్న 9 మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటోలో పరిమితికి మించి వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 108 వాహనం రావడానికి ఆలస్యం కావడంతో విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గాయాలైన వారిని ఆటోలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. సుద్దాల లింగవ్వకు చేయి విరిగినట్లు తెలుస్తోంది. దీంతో సర్పంచ్ రెడ్డి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, పంచాయతీ సెక్రెటరీ మౌనిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స అందించే వరకు అక్కడే ఉన్నారు.






