చైతు@20.. ‘థాంక్యూ’

by  |
చైతు@20.. ‘థాంక్యూ’
X

అక్కినేని వారసుడు నాగ చైతన్య సెలెక్టెడ్‌ మూవీస్ చేస్తున్నాడు. ‘మజిలీ’ సినిమాతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతు.. ‘లవ్ స్టోరీ’ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని ఫిక్స్ అయ్యాడు. కాగా, తండ్రి నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని తన 20వ చిత్రం వివరాలు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకులు కాగా, ‘థాంక్యూ’ మూవీ కథ చెప్పేందుకు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇలాంటి మూవీ యూనిట్‌ను కలుసుకున్నందుకు నిజంగా థాంక్స్ చెప్పాడు.

ఇక నాగ్‌కు చాలా స్పెషల్‌గా విష్ చేసింది ‘థాంక్యూ’ మూవీ యూనిట్. తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు నిర్మాత దిల్ రాజు నాగార్జునకు థాంక్యూ చెప్తూ విష్ చేస్తే.. ‘మనం’ సినిమా ఇచ్చినందుకు థాంక్యూ చెప్తూ బర్త్‌డే విషెస్ అందించాడు డైరెక్టర్ విక్రమ్. ‘నా కింగ్‌గా ఉన్నందుకు థాంక్యూ డాడీ’ అంటూ నాగ్‌కు థాంక్యూ చెప్పిన చైతు.. హార్ట్ ఫుల్ విషెస్ అందించారు.

Next Story