- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఆయన ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా అంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కరోనా వైరస్‌పై కూడా పోరాటం చేసిన వారు కాదని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై తనకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ ఆరోపణల్లో పక్కా ఆధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని స్పీకర్ స్పష్టం చేశారు. మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఆయన ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా అంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కరోనా వైరస్‌పై కూడా పోరాటం చేసిన వారు కాదని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై తనకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ ఆరోపణల్లో పక్కా ఆధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని స్పీకర్ స్పష్టం చేశారు. మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీసీలను అవమానించొద్దని.. బీసీ వర్గంలో చిచ్చుపెట్టడం సరికాదన్నారు.
Next Story






