చంద్రబాబు రైతులను మోసం చేశారు : స్పీకర్ తమ్మినేని

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో : సీఎం జగన్‌కు మాట ఇవ్వడమే తప్ప.. మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకు గొప్ప పథకాలను అందించి వారి అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ [&hellip;]</p>

ap assembly speaker tammineni sitaram
X

దిశ, ఏపీ బ్యూరో : సీఎం జగన్‌కు మాట ఇవ్వడమే తప్ప.. మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకు గొప్ప పథకాలను అందించి వారి అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు.

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడితే.. చంద్రబాబు బట్టలు ఆరబెట్టుకోవటమే అని విమర్శించారని దుయ్యబట్టారు. అసలు వ్యవసాయమే దండగ అని రాష్ట్ర రైతులను చంద్రబాబు మోసం చేశారని స్పీకర్ తమ్మినేని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మధ్యవర్తులు, దళారులు, జన్మభూమి కమిటీలు వంటివి లేకుండా నిర్మూలించామని పేర్కొన్నారు. నేరుగా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

Next Story