'వకీల్ సాబ్' నుండి మరో అప్డేట్ ఇచ్చిన థమన్

by  |
వకీల్ సాబ్ నుండి మరో అప్డేట్ ఇచ్చిన థమన్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ తెరముందు కనిపిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక భారీ అప్ డేట్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులను పూర్తి చేసుకుంటుందని తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసారు. అంతేకాకుండా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ మూడో సింగిల్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

https://twitter.com/MusicThaman/status/1371149478225272834



Next Story