తలైవా అడ్వెంచర్స్.. ఫ్యాన్స్‌కు పండగే

by  |
తలైవా అడ్వెంచర్స్.. ఫ్యాన్స్‌కు పండగే
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫ్యాన్స్ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. ఆయన సాహసాలను చూసేందుకు సన్నద్ధంగా ఉన్న అభిమానులకు పండుగ చేసుకునే రోజు వచ్చేసింది. కేవలం కొద్ది గంటల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ చేసిన అడ్వెంచర్‌ను ఆస్వాదించబోతున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా డిస్కవరీ చానల్‌లో రా. 8గంటలకు ఇన్ టు ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అండ్ సూపర్ స్టార్ ప్రీమియర్ షోను చూడబోతున్నారు. వారి నిజమైన సాహసాలను చూసి ఎంజాయ్ చేయబోతున్నారు.

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇండియా చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ట్వీట్ చేశాడు బేర్ గ్రిల్స్. కోట్ల మంది తలైవా ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఈ రోజుతో తెరపడనుందన్నాడు. అతి త్వరలో యాక్షన్ ప్రారంభం కాబోతోందని… తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నాడు. నా జీవితంలో అత్యంత సాహసోపేతమైన అనుభవాల్లో ఇదొక్కటి అన్నాడు రజినీ. బేర్ గ్రిల్స్‌కు ధన్యవాదాలు తెలిపిన తలైవా… నేను చేసిన అడ్వెంచర్‌ను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు.కర్ణాటకలోని బందీపూర్ అడవుల్లో జరిగిన షూటింగ్‌లో బేర్ గ్రిల్స్‌తో రజినీ చేసిన అడ్వెంచర్స్ ఆకట్టుకోనున్నాయి. ఇప్పటికే ఈ ప్రోగ్రాం ప్రోమో అడ్వెంచరస్‌గా ఉండగా… ఎప్పుడెప్పుడు చూస్తామా అని రజినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed