సందీప్ మక్తలాకు టెక్సాస్ యూనివర్శిటీ ప్రశంస.. మంత్రి కేటీఆర్‌కు లేఖ

143
minister ktr

దిశ, మక్తల్ : నారాయ‌ణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు కోడింగ్‌లో మెరుగైన శిక్షణ అందించిన టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ జై మ‌ఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షులు సందీప్ మ‌ఖ్తల్‌ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ తెలంగాణ ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖను గురువారం ఆయన విలేఖర్లకు చూపించారు. కోడింగ్ స్కిల్స్ నైపుణ్యాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు సెప్టెంబర్ 13 నుంచి నాలుగు వారాల పాటు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.

జిల్లాలోని 61 పాఠ‌శాల‌ల‌కు చెందిన మొత్తం 183 మంది విద్యార్థులకు సెకండ్ ఫేజ్‌లో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 12వ తేదీ వ‌ర‌కు ట్రైయినర్ల స‌హ‌కారంతో ఒక్కో పాఠ‌శాల‌లో 30 మందికి చొప్పున శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ల్యాప్‌ట్యాప్ ద్వారా విద్యార్థుల‌కు కోడింగ్ నైపుణ్యంలో కల్పించి.. స్క్రాచ్, పైథాన్ వంటి అంశాల‌పై ఓవరాల్‌గా 2013 మంది విద్యార్థులు, టీచర్లకు కోడింగ్ పై శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. కోర్సులో ఉత్తీర్ణులయిన వారికి యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లస్ ద్వారా సర్టిఫికేట్ అందించామన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల‌ ప్రభుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు తీర్చిదిద్దడం దేశంలో ఇదే మొట్టమొద‌టిసారి అని వివరించారు.

జిల్లాలోని 120 హైస్కూల్‌లలో ప్రతీ స్కూల్‌కు ఒక స్మార్ట్ టీవీని మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో అందజేశామన్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల‌కు కంప్యూట‌ర్ లాగిన్ పుస్తకాలను ఉచితంగా అంద‌జేశామన్నారు. క‌నీస సౌక‌ర్యాలు కూడా లేని ప్రభుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు దేశంలోనే ఈ త‌ర‌హా విభిన్నమైన శిక్షణ‌ నిర్వహించడం మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యద‌ర్శి జ‌యేశ్ రంజన్, నారాయ‌ణ‌పేట జిల్లా క‌లెక్టర్ దాస‌రి హ‌రిచంద‌న, టీఎస్‌టీఎస్ ఎండీ జీటీ వెంక‌టేశ్వర్ రావు, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్తలను యూనివర్శిటీ వారు ప్రశంసించినట్లు సమాచారం.