నిబంధనలకు విరుద్దంగా పరీక్షలు

by  |
నిబంధనలకు విరుద్దంగా పరీక్షలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తు్న్న క్రమంలో విద్యాసంస్థలను ప్రభుత్వం బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్, ఒకేషనల్ విద్యార్థులకు ఎన్విరాన్ మెంటల్ పరిక్షలను ఇంటివద్ధనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ర్టంలో అన్ని కళాశాలలు ఇంటివద్ధనే పర్యవారణ పరిక్షలను నిర్వహిస్తున్నాయి.

కానీ అందుకు విరుద్దంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ బోర్డు జిల్లా అధికారి కార్యాలయంకు కిలో మీటర్ దూరంలో ఉన్న వాణి ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఎన్విరాన్ మెంటల్ పరీక్షలను నిర్వహించారు. కనీసం మాస్కు ధరించకుండా, భౌతిక ధూరం పాటించకుండా పరీక్షలను నిర్వహించారు. దీంతో విద్యార్థి సంఘాలు జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేశాయి. దీనిపై వాణి ఒకేషనల్ జూనియర్ కళాశాల యాజమాన్యంకు వివరణ కోరినట్లు డిఐఇఓ రఘురాజ్ తెలిపారు.



Next Story