బజాజ్ కంపెనీలపై సైబర్ దాడి

by Muthe.Rajitha |

: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీపై సైబర్ దాడి జరిగింది.

బజాజ్ కంపెనీలపై సైబర్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీపై సైబర్ దాడి జరిగింది. బజాజ్ ఆటోతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ (BATL) ల ఐటీ సిస్టమ్స్‌పై కూడా రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ సైబర్ దాడిని గుర్తించిన వెంటనే కంపెనీ అంతర్గత సాంకేతిక బృందం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టడం వల్ల తీవ్రమైన నష్టాన్ని అరికట్టగలిగామని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

డేటా భద్రమేనా?

ఈ దాడి నుండి వ్యవస్థలను కాపాడుకున్నామని కంపెనీ ప్రకటించినప్పటికీ, దీని వల్ల కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు ఏమైనా అంతరాయం కలిగిందా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అలాగే, కంపెనీకి చెందిన కీలకమైన వినియోగదారుల సమాచారం ఏమైనా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిందా, కీలక డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందా అనే నిర్దిష్ట వివరాలను బజాజ్ ఆటో ప్రస్తుతానికి వెల్లడించలేదు.

కేంద్రానికి నివేదిక

ఐటీ చట్టాల (IT Act) నిబంధనలను అనుసరిస్తూ, అలాగే కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్ ప్రమాణాలకు కట్టుబడి బజాజ్ ఆటో ఈ సైబర్ దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ అధికారిక సైబర్ భద్రతా విభాగమైన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కు అధికారికంగా నివేదించింది. ఇలాంటి పెద్ద సంస్థలపై జరిగే దాడులను వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల దేశంలోని ఇతర పరిశ్రమలు కూడా అప్రమత్తమవడానికి అవకాశం ఉంటుంది.

Next Story