Today's Horoscope:నేటి రాశి ఫలాలు (25-06-2026)

by Jakkula.Mamatha |

ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. నూతన పనులకు చక్కని రూపకల్పన చేస్తారు.

Todays Horoscope:నేటి రాశి ఫలాలు (25-06-2026)
X

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా చిన్నపాటి ధనలాభం ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అయితే అనారోగ్య సూచనలు ఉన్నందున ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ కార్యాలయంలో సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు, వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. అనవసర ఖర్చులు నియంత్రించండి.

మిథున రాశి

వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి

ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. నూతన పనులకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతారు.

సింహ రాశి

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన మార్పుల గురించి ఆలోచిస్తారు. భూములు, ఇళ్ల స్థలాలు కొనాలనే మీ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అయితే, రహస్య శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కన్య రాశి

ఈ రోజు బంధుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, పనులు సాగిపోతాయి. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

తులా రాశి

రాజకీయ మరియు సామాజిక వ్యవహారాల్లో ఉన్నవారికి దిగ్విజయం లభిస్తుంది. తలపెట్టిన పనులు సంపూర్ణంగా ఫలిస్తాయి. గౌరవమర్యాదలు, శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి. బిజీ లైఫ్ వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

వృశ్చిక రాశి

కార్యాలయంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. విలాసాల కోసం మరియు అనారోగ్య సమస్యల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. దైవ దర్శనం చేసుకుంటారు.

ధనుస్సు రాశి

ఈరోజు పనులలో కొంత జాగ్రత్త అవసరం. అకారణంగా కలహాలు లేదా మనస్పర్థలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసర భయాలకు లోనుకాకండి. వ్యాపార రంగంలోని వారు పెట్టుబడుల విషయంలో హెచ్చరికగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

మకర రాశి

గృహంలో మార్పులు లేదా శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. కొన్ని పనులు వాయిదా పడినప్పటికీ, పట్టుదలతో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ఈరోజు ప్రారంభించక పోవడం మంచిది. పిల్లల విషయంలో ఎక్కువ పట్టుదలకు పోకండి.

మీన రాశి

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుండి బయటపడతారు. తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడులు పెట్టి నష్టపోకండి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాయంత్రానికి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Next Story