దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు.. నలుగురిపై కేసు నమోదు

by Jakkula.Mamatha |

దేవరుప్పుల మండల కేంద్రంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారని పక్కా సమాచారం రాగా దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి చింత సుదర్శన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు.. నలుగురిపై కేసు నమోదు
X

దిశ,పాలకుర్తి: దేవరుప్పుల మండల కేంద్రంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారని పక్కా సమాచారం రాగా దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి చింత సుదర్శన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నోట్లు తయారు చేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, చింత సుదర్శన్ మరియు గుండాల మండలం బండ కోతపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్యలు పట్టుబడ్డారు.

వారి నుంచి ఒక ప్రింటర్, దొంగ నోట్లు ఒక సైడ్ ప్రింట్ చేసిన(4)పేపర్లు 150 ఒక పేపర్ నందు నాలుగు 500 రూపాయల విలువ గలవి, వాటి విలువ మూడు లక్షలుగా మరియు 8 నల్ల కాగితపు బెండలు , బ్రీజ కార్, రూ.85000/- నగదు, నాలుగు ఫోన్లు స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి వాటికి అస్సలు తవ్వివ్వకూడదని ఇలాంటి వాటితో దేశ భద్రతకే ముప్పు, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

Next Story