‘మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి’.. విద్యార్థులకు ఎక్సైజ్ ఎస్సై కీలక సూచనలు

by Jakkula.Mamatha |

విద్యార్థి దశలో ఉండే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని జడ్చర్ల ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి అన్నారు.

‘మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి’.. విద్యార్థులకు  ఎక్సైజ్ ఎస్సై కీలక సూచనలు
X

దిశ, జడ్చర్ల: విద్యార్థి దశలో ఉండే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని జడ్చర్ల ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతే దేశ భవిష్యత్తు, మత్తు పదార్థాలకు బానిసై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి, గుట్కా, మద్యం లాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. విద్యార్థి దశ నుంచే వీటికి దూరంగా ఉండి, మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి అని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన శిక్షలు, ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇవ్వాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ వివరాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులంతా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఎక్సైజ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story