సొసైటీ కాంప్లెక్స్‌కు తాళాలు

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లకు సుమారుగా రూ.1,80,000 వరకు కిరాయిలు బకాయిలు ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షట్లర్లకు తాళాలు వేసినట్లు సొసైటీ సీఈవో అల్లి గౌరమ్మ తెలిపారు.

సొసైటీ కాంప్లెక్స్‌కు తాళాలు
X

దిశ, మంగపేట: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లకు సుమారుగా రూ.1,80,000 వరకు కిరాయిలు బకాయిలు ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షట్లర్లకు తాళాలు వేసినట్లు సొసైటీ సీఈవో అల్లి గౌరమ్మ తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని షట్టర్లలో షాపులు నడుపుకుంటున్న వారు ప్రతి నెల సక్రమంగా కిరాయిలు చెల్లించడం లేదని వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బకాయిలు ఉన్న షట్టర్లకు తాళాలు వేసినట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెల షాపుల యజమానులు కిరాయిలు చెల్లించనట్లయితే వారి షట్లర్లు అధికారుల ఆదేశాల మేరకు ఖాళీ చేయించనున్నట్లు తెలిపారు.

Next Story