SPG డైరెక్టర్‌ ఆలోక్ శర్మ పదవీకాలం పొడిగింపు: ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

by Kema Shiva Kumar |

ప్రత్యేక రక్షణ బృందం డైరెక్టర్ ఆలోక్ శర్మ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

SPG డైరెక్టర్‌ ఆలోక్ శర్మ పదవీకాలం పొడిగింపు: ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక రక్షణ బృందం (Special Protection Group) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలోక్ శర్మ (Alok Sharma) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 9 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖకు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్(ACC) అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, 1991 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ (IPS) అధికారి అయిన ఆలోక్ శర్మ ప్రస్తుత పదవీకాలం ముగియనుండటంతో, కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆలోక్ శర్మ జూలై 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎస్పీజీ డైరెక్టర్‌ కొనసాగనున్నారు. దేశ ప్రధానికి అత్యున్నత భద్రత కల్పించే అత్యంత కీలకమైన ఎస్పీజీ విభాగానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.

Next Story