- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్.. వారణాసిలో అంగరంగ వైభవంగా వేడుక
టీమిండియా ఫాస్ట్ బౌలర్ పెళ్లి పీటలు ఎక్కేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత యువ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akash Deep) ఓ ఇంటివాడయ్యారు. ఆయన అక్షితా రాజ్ (Akshita Raj) అనే యువతితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక నగరమైన వారణాసి (Varanasi)లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ సాంప్రదాయ వివాహానికి సంబంధించిన వేడుకలు 2 రోజుల క్రితమే బీహార్‌లోని ఆకాశ్ దీప్ స్వగ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న వారణాసిలో బంధువులు, అత్యంత ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి కల్యాణం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా అవుతున్నాయి.
Next Story






