- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధర్మన్’ కోసం భారీ ప్లాన్.. 8 సాంగ్స్‌తో మ్యూజికల్ ఫీస్ట్
రజనీ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో ఎనిమిది పాటలు ఉండనున్నాయని ఓ టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్, ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ధర్మన్’ (ది డెడ్లీ డాక్టర్) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే... ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ ఎనిమిది పాటలు కూడా విభిన్న జానర్లలో ఉండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ ఇంట్రో సాంగ్ చాలా సాలిడ్‌గా ఉండబోతుందని, ఇప్పటికే ఆ ట్యూన్‌ను అనిరుధ్ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాలో ఎనిమిది పాటలు ఉంటాయా? ఉంటే అవి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.






