- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్‌గా నమోదు చేయాలి: మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్
అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని పకడ్బందీగా ఎస్ఐఆర్ సర్వే నిర్వహించాలని మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్ అధికారులను, బీఎల్ఓలను ఆదేశించారు.

దిశ, మక్తల్: అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని పకడ్బందీగా ఎస్ఐఆర్ సర్వే నిర్వహించాలని మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్ అధికారులను, బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నుండి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్ సర్వేకు సంబంధించిన మెటీరియల్‌ను, ఓటర్ నమోదు ఫారాలను మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుంచే ఆయన పంపిణీ చేశారు. బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ఈ సర్వే ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా, మాగనూర్, మక్తల్, ఉట్కూర్, నర్వ, ఆత్మకూర్, అమరచింత అనే 7 మండలాలు, 284 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన మెటీరియల్‌ను ఆయా మండలాల బాధ్యత గల అధికారులకు అందజేయాలని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వీటిని బీఎల్ఓలకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని, 2001 ప్రకారం ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వారిని మాత్రమే ఓటరు నమోదు చేసుకునే వారికి ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం నిర్మించుకున్న వారికి డబుల్ ఓట్లు ఉన్నవారిని బీఎల్‌వోలో వెరిఫికేషన్ చేసుకోవాలని అన్నారు. దాని ప్రకారం సర్వే నిర్వహించాలని తహసీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాజు. భూపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.






