హాస్పిటల్ పొజిషన్ చేంజ్.. ఇన్స్పెక్టర్ సీటుకు ఎసరు..

by Taduka Kalyani |

ఓ హాస్పిటల్ పొజిషన్ ను తన అధికార దుర్వినియోగంతో చేంజ్ చేశాడనే ఆరోపణల పై గ్రేటర్ హైదరాబాద్ లోని గ్లోబల్ దృష్టిని ఆకర్షించే ఓ కమిషనరేట్ పోలీసు బాసు ఇన్స్ పెక్టర్ పై అటాచ్ మెంట్ వేటు వేశారు.

హాస్పిటల్ పొజిషన్ చేంజ్.. ఇన్స్పెక్టర్ సీటుకు ఎసరు..
X

దిశ, సిటీక్రైం : ఓ హాస్పిటల్ పొజిషన్ ను తన అధికార దుర్వినియోగంతో చేంజ్ చేశాడనే ఆరోపణల పై గ్రేటర్ హైదరాబాద్ లోని గ్లోబల్ దృష్టిని ఆకర్షించే ఓ కమిషనరేట్ పోలీసు బాసు ఇన్స్ పెక్టర్ పై అటాచ్ మెంట్ వేటు వేశారు. పోలీసు బాసు యాక్షన్ ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీసింది. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఓ కీలక ప్రాంతంలో హాస్పిటల్ కు సంబంధించిన వివాదం తలెత్తింది. హాస్పిటల్ నడిపిస్తున్న నిర్వాహకులు భవనం యజమానికి కొన్ని నెలల నుంచి అద్దె చెల్లించడం లేదు. హాస్పిటల్ నిర్వాహకులు అద్దె చెల్లించకుండా మరో హాస్పిటల్ వారికి లీజుకు ఇచ్చారు. లీజుకు తీసుకున్న నిర్వాహకులు భవనం యజమానితో మాట్లాడి పాత హాస్పిటల్ నిర్వాహకుల బాకీ అద్దెను చెల్లించి కొత్తగా హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించి ఇంటీరియర్ పనులు ప్రారంభించారు. ఇంతలో ఏమైందో భవనం యజమాని తన భవనాన్ని ఖాళీ చేయాలని పట్టుబట్టాడు. అద్దె మొత్తం చెల్లించిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటుకు ఇంటీరియర్ చేపించుకుంటుంటే ఖాళీ చేయమనడం సరి కాదని వారు తేల్చి చెప్పారు. భవనం యజమాని జోన్ స్థాయి అధికారి వద్దకు వెళ్ళాడు. ఆ జోన్ స్థాయి అధికారి ఆదేశాలతో స్థానిక ఠాణా ఇన్స్ పెక్టర్ వెనకా ముందు ఆలోచించకుండా పనులు నడుస్తున్న భవనానికి తాళం వేసి యజమానికి అప్పజెప్పారు. అయితే లీజుకు తీసుకున్న హాస్పిటల్ నిర్వాహకులు ఇన్స్ పెక్టర్ ప్రవర్తనతో పాటు భవనం యజమాని వ్యవహారాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. విషయాన్ని పరిశీలించిన సీపీ ఇన్స్ పెక్టర్ ను అటాచ్ చేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చి బాధ్యతలను ఆ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ కు అప్పజెప్పినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. మరో వైపు తన తప్పు ఏమి లేదని జోన్ స్థాయి ఉన్నతాధికారి చెప్పడంతోనే పొజిషన్ ఛేంజ్ చేయాల్సి వచ్చిందని ఆ ఇన్స్ పెక్టర్ తన తెలిసిన అధికారుల వద్ద వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక హాస్పిటల్ పొజిషన్ చేంజ్ ఇప్పుడు ఒక ఇన్స్ పెక్టర్ సీటుకు ఎసరు తెచ్చిందనే అంశం హాట్ టాపిక్ అయ్యింది.

Next Story