నిర్మాతలకు విజయ్ దేవరకొండ షాకింగ్ కండీషన్స్.. స్పందించి క్లారిటీ ఇచ్చిన ‘రణబాలి’ మూవీ టీమ్

by Mallepaka Hamsa |

విజయ్ దేవరకొండ ఏకంగా 5 నుండి 6 క్యారవాన్లు కావాలని డిమాండ్ చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

నిర్మాతలకు విజయ్ దేవరకొండ షాకింగ్ కండీషన్స్.. స్పందించి క్లారిటీ ఇచ్చిన ‘రణబాలి’ మూవీ టీమ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా..ఈ సినిమాను సెప్టెంబర్ 11న థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ షాకింగ్ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘రణబలి’ సినిమా షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 5 నుండి 6 క్యారవాన్లు కావాలని డిమాండ్ చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రముఖ న్యూస్ పోర్టల్స్, యాప్స్ పేర్లతో ఉన్న ఫేక్ స్క్రీన్ షాట్స్‌ను కూడా సృష్టించి సర్కులేట్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త మూవీ టీమ్ కంటపడటంతో నిర్మాత రవి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని, ఇవన్నీ పూర్తిగా అబద్ధపు ముచ్చట్లని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కొందరు కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని.. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని, అలాగే వాటిని షేర్ చేస్తూ రూమర్స్‌ను అస్సలు నమ్మించవద్దని కోరారు. విజయ్ దేవరకొండ ఎప్పుడూ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారని.. సినిమాను చెడగొట్టడానికి కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను ఎవరూ నమ్మొద్దు, షేర్ చేయొద్దని కోరారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Next Story