- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వారణాసి' షూటింగ్‌పై రాజమౌళి సూపర్ అప్డేట్.. అప్పటికి పూర్తి కానున్న సినిమా
'వారణాసి' షూటింగ్ అక్టోబర్ ప్రారంభం వరకు పూర్తయ్యే అవకాశముందని రాజమౌళి వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా రూపొందుతున్న 'వారణాసి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని మహేష్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందినవారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్డేట్‌ను వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ప్రధాన సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్‌ల చిత్రీకరణ పూర్తైందని తెలిపారు. ప్రస్తుతం చిన్న సన్నివేశాలు, కథను అనుసంధానించే ఇంటర్‌కనెక్టింగ్ సీన్ల షూటింగ్ జరుగుతోందని చెప్పారు.
అన్నీ అనుకున్నట్లుగా సాగితే సెప్టెంబర్ నాటికి లేదా అక్టోబర్ ప్రారంభంలో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే ఈ చిత్రాన్ని IMAX ఫార్మాట్‌కు అనుగుణంగా చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కథకు అవసరమైన కీలక సన్నివేశాలను మాత్రమే IMAX ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నామని చెప్పారు. సినిమా స్కోప్ , IMAX ఫార్మాట్‌లలోనూ ప్రేక్షకులకు ఒకే స్థాయిలో అద్భుతమైన విజువల్ అనుభూతి కలిగేలా ఫ్రేమింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని రాజమౌళి వివరించారు.






