- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: ఫ్రైడే- డ్రైడే(Friday- Dryday) కార్యక్రమంగా రాష్ట్రమంతా నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మురుగు కాలువల శుద్ధి, సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్త వంటి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం క్షేత్ర స్థాయిలో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మురుగు నీటి నిల్వలను తొలగించాలని చెప్పారు. సీజన్ వ్యాధులు ప్రజలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తాగు నీరు, పారిశుధ్య నిర్వహణ, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి లక్ష్యమని, అన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోదుతులో అందుబాటులో ఉంచాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.






