20 భాషల్లో ‘వారణాసి’.. ప్రియాంకా చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

వారణాసి సినిమాను దాదాపు 20 భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నట్లు ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

20 భాషల్లో ‘వారణాసి’.. ప్రియాంకా చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఆమె, అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా ‘వారణాసి’ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రియాంక మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రాంతీయ భాషల సినిమాలు, సిరీస్‌లు చాలా పరిమిత ప్రాంతానికే పరిమితమయ్యేవని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. మంచి కథ, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ‘వారణాసి’ సినిమా గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తున్నానని, ఈ సినిమాను దాదాపు 20 భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని వెల్లడించారు. దీంతో ప్రాంతీయ చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా పెరుగుతోందో అర్థమవుతుందని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలతో ‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Next Story