- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో స్పీడ్ పెంచిన జనసేన.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాల షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై కార్యాచరణే లక్ష్యంగా జనసేన జూన్ 28 నుంచి జూలై 7 వరకు జనసేన పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ వివాదాల నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్పీడ్ పెంచింది. జనసేన పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజల సమస్యలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జూన్ 28 నుంచి జూలై 7, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు విడతలుగా (ఉదయం 10:30 గంటలకు - సాయంత్రం 3:00 గంటలకు) ఈ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 28న సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలతో ప్రారంభమై.. జూలై 7న నిజామాబాద్, భువనగిరి నియోజకవర్గాల సమావేశాలతో ఈ షెడ్యూల్ ముగియనుంది.
ఈ పది రోజుల పాటు జరిగే విస్తృత స్థాయి సమావేశాలలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సహా అన్ని ప్రధాన పార్లమెంట్ స్థానాల పరిధిలోని స్థితిగతులపై పార్టీ అధిష్టానం సమీక్షించనుంది. పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ పరస్పర సమన్వయంతో ఈ సమావేశాలలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. స్థానిక ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు ఈ సమావేశాలు దిశానిర్దేశం చేస్తాయని పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






