- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: వెనెజువెలాలో భూకంపం.. కొన్ని క్షణాల ముందు ఫోన్లకు ‘గూగుల్ అలర్ట్’
వెనెజువెలాలో వరుస భూకంపాల వేళ మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: వెనెజువెలా(Venezuela) దేశాన్ని ఒకేసారి రెండు శక్తివంతమైన భూకంపాలు అల్లాడించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 7.1, 7.5గా నమోదయ్యాయి. భూప్రకంపనల ధాటికి భారీ భవనాలు ఒక్కసారిగా పేకమేడల కూలిపోయాయి. గత శతాబ్ద కాలంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలు తమ దేశంలో ఇవేనని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విపత్తు వేళ మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భూ ప్రకంపనలు భూమి పైభాగానికి తగలడానికి కొన్ని సెకన్ల ముందే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు గూగుల్ (Google) నుంచి భూకంప హెచ్చరిక (Earthquake Alert) వచ్చిందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు.
‘గూగుల్’కు ముందే ఎలా తెలిసిందంటే..
భూకంపం రాకముందే గూగుల్ ఎలా పసిగట్టగలింగిందనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో అక్సెలెరోమీటర్ (Accelerometer) సెన్సార్ ఉంటుంది. ఇది స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా భూమిలో వచ్చే సూక్ష్మమైన వైబ్రేషన్లకు కూడా గుర్తించగలదు. ప్రపంచంలో ఎక్కడ భూమి కంపించినా, ఆ ప్రాంతంలోని ఆండ్రాయిడ్ ఫోన్లలోని అక్సెలెరోమీటర్ సెన్సార్లు ఆ వైబ్రేషన్‌ను గుర్తించి, వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ సర్వర్‌కు వెళ్లగానే అక్కడి నుంచి ఆటోమెటిక్‌గా యూజర్‌కు ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ వెళ్తుంది.






