పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి: సీఐటీయూ డిమాండ్

by Jakkula.Mamatha |

అనంతగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి: సీఐటీయూ డిమాండ్
X

దిశ, అనంతగిరి: అనంతగిరి మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యసంతాపురం గ్రామపంచాయతీలో ఆరు నెలలుగా, త్రిపురవరం గ్రామంలో నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. అలాగే శాంతినగర్, ఖానాపురం, అజ్మీర్ తండా గ్రామాల్లో రెండు నెలల వేతనాలు బకాయి ఉన్నట్లు సమాచారం. వేతనాలు రాకపోవడంతో నిత్యావసర ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు నిర్వహించడం కష్టంగా మారిందని కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గుండు సురేష్ డిమాండ్ చేశారు. గ్రామాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన కోరారు.

Next Story