- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డీవో మాలి కృష్ణారెడ్డి
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భువనగిరి పట్టణంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భువనగిరి పట్టణంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భువనగిరి ఆర్డీవో, ఎన్నికల నమోదు అధికారి మాలి కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాల ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చిరునామా మార్పులు తదితర వివరాలను ఫారాల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తహశీల్దార్ జగన్మోహన్ ప్రసాద్, డీటీ ప్రణయ్, బీఎల్ఓలు పాల్గొన్నారు.






