- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సురేష్ ప్రొడక్షన్స్ చేతికి ‘నాగబంధం’ హక్కులు
‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్ర కృష్ణా మరియు ఈస్ట్ గోదావరి ప్రాంతాల థియేట్రికల్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అభిషేక్ నామ, తాజాగా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ‘పెద్దకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు అన్ని ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను కూడా వరుసగా విక్రయిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో తాజాగా కృష్ణా, ఈస్ట్ గోదావరి ప్రాంతాల థియేట్రికల్ హక్కులను కూడా మేకర్స్ విక్రయించారు. ఈ రెండు ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కృష్ణా, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో సురేష్ ప్రొడక్షన్స్‌కు మంచి పట్టున్న నేపథ్యంలో, ఈ సినిమాకు ఆ ప్రాంతాల్లో భారీ స్థాయిలో థియేటర్లు దొరికే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్లినట్లు సమాచారం. మరి విడుదల తర్వాత ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.






