- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగభద్ర ప్రాజెక్టు వద్ద అపూర్వ ఘట్టం.. ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ
తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభానికి ముందే హోస్పేటలోని ఐఆర్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లోని హోస్పేట (Hospet) వేదికగా అరుదైన చిత్రం చోటుచేసుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందు ఐఆర్‌బీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కర్ణాటక సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, జలవనరుల ప్రాజెక్టుల నిర్వహణ, పరస్పర సహకారంపై ఈ సందర్భంగా నేతల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత యుద్ధప్రాతిపదికన కొత్త గేట్ల ఏర్పాటును పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ గేట్లను ప్రారంభించడానికి ముందు జరిగిన ఈ భేటీ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.






