- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగాదరులకు ‘సువర్ణా’వకాశం.. మళ్లీ బంగారం ధరలు ఢమాల్!
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు ఎవరూ ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనాలనుకునే వినియోగదారులకు సువర్ణావకాశం రానేవచ్చింది. ఇన్నాళ్లు కొండెక్కిన పసిడి ధరలు మెల్లిగా సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో గురువారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.2,780 మేర భారీగా క్షీణించి రూ.1,40,130 వద్దకు చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ.7,850 మేర తగ్గడం విశేషం. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,550 పతనమై రూ.1,28,450 పలుకుతోంది.
స్థిరంగానే వెండి ధరలు..
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం మార్కెట్‌లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,39,900 వద్ద విక్రయిస్తున్నారు. అయితే, పైన పేర్కొన్న బులియన్ మార్కెట్ ధరలపై 3 శాతం జీఎస్టీ (GST) అదనంగా వినియోగదారులపై పడనుంది.






