NBK112 రిలీజ్ డేట్.. ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్

by Pulgam srinivas |

వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక సినిమాతో, సమ్మర్‌కు మరో సినిమాతో బాలయ్య ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు తెలుస్తోంది.

NBK112 రిలీజ్ డేట్.. ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ–కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. స్టార్ హీరో–స్టార్ డైరెక్టర్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభానికి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సంక్రాంతి, సమ్మర్ మధ్య పెద్దగా గ్యాప్ లేకుండానే బాలయ్య అభిమానులను రెండు సినిమాలతో అలరించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు చిత్రాలు తక్కువ వ్యవధిలోనే విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

Next Story