- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌లను ఢీకొట్టిన బస్సు, నలుగురు దుర్మరణం!
ఢిల్లీ నంద్ నగరి డిపో వద్ద ఘోర ప్రమాదం.. సిగ్నల్ వద్ద బైక్‌లను ఢీకొట్టిన యూపీ బస్సు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు!

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని నంద్ నగరి (Nand Nagri) డిపో సమీపంలో వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు బస్సు నియంత్రణ కోల్పోయి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా దారుణంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరిస్తూ.. "మేమంతా రెడ్ లైట్ సిగ్నల్ పడటంతో అక్కడ ఆగి ఉన్నాం. మా పక్కనే బైక్‌లపై మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. అంతలోనే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక బస్సు నేరుగా వచ్చి బైక్‌లను, మిగతా వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 3 నుండి 4 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన ఆ బస్సు ఉత్తరప్రదేశ్ (UP) రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది" అని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సమాచారం అందుకున్న నంద్ నగరి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






